స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించి, స్వయంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్, భారీ ఓపెనింగ్స్‌పై తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
సాధారణంగా కమర్షియల్ సినిమాలకు వచ్చే రేంజ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు మొదటి రోజే ఈ స్థాయి ఆదరణ రావడం చాలా అరుదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సమంత ఆనందం వ్యక్తం చేశారు. “ఒక మహిళా ప్రాధాన్యమున్న సినిమాకు ఫస్ట్ డే నుంచే ప్రేక్షకులు ఇంతటి విజయాన్ని అందించడం చూస్తుంటే మాటలు రావడం లేదు. థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది” అని ఆమె పేర్కొన్నారు.
నటిగా, నిర్మాతగా ఈ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించారని సమంత భావోద్వేగానికి లోనయ్యారు. “ఈ విజయం మా చిత్ర యూనిట్ మొత్తానికి ఎంతో విలువైనది. నన్ను నమ్మి థియేటర్లకు వస్తున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత చేసిన ఈ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.