Find Articles

త్రిష సెల్యూట్ వివాదంపై ప్రభాస్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి విజయ్‌కు స్టార్ హీరోయిన్ త్రిష సెల్యూట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విజయ్, త్రిషల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంపై ప్రభాస్ బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ తీవ్ర స్థాయిలో స్పందించారు.

విజయ్ విజయవంతమైన ప్రయాణాన్ని ఓర్వలేకే!

విజయ్ రాజకీయ ఎదుగుదలను, ఆయన అందిస్తున్న సత్పరిపాలనను తట్టుకోలేకే కొందరు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని సంజన మండిపడ్డారు. “ధైర్యం ఉంటే విజయ్ పాలన గురించి మాట్లాడాలి. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఆయన త్వరితగతిన స్పందిస్తూ, ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకట్టుకుంటున్నారు. పరిపాలనలో ఎలాంటి లోపాలు ఎత్తిచూపలేకే, ఇలా వ్యక్తిగత విషయాలను పట్టుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు” అని విమర్శించారు.

మహిళలను లక్ష్యంగా చేసుకునే రాజకీయాలు చెల్లవు!

విజయ్, త్రిషల మధ్య ఉన్న బంధం వారి పర్సనల్ లైఫ్‌కి సంబంధించినదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని సంజన హితవు పలికారు. త్రిష సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న గొప్ప నటి అని కొనియాడారు. కేవలం మహిళలను లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడే రాజకీయాలను సమాజం ఎప్పటికీ ఆమోదించదని సంజన ఘాటుగా స్పష్టం చేశారు.

Keerthi