మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక మైలురాయి చిత్రం (#Mega158) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక స్పెషల్ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ మాసివ్ టైటిల్‌ను ఖరారు చేశారు.
మిడిల్ క్లాస్ లుక్‌లో మెగాస్టార్.. రెండు విభిన్న పాత్రల్లో!
విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో చిరంజీవి ఒక సాదాసీదా మధ్యతరగతి వ్యక్తిగా కనిపించి ఆకట్టుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ రెండు వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరించబోతున్నారని, పూర్తిస్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీనిని తీర్చిదిద్దుతున్నారని టాక్.
తమన్ మాస్ మ్యూజిక్ రచ్చ!
ఈ భారీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మెగాస్టార్ మానియాకి తగ్గట్టుగా తమన్ అందించే మాస్ బిజీఎమ్స్, పాటలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మెగా బర్త్‌డే కానుకగా వచ్చిన ‘కాకా’ అప్‌డేట్‌తో మెగా అభిమానులు సోషల్ మీడియా వ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు.