విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam). పలుమార్లు వాయిదాల పర్వం తర్వాత, ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ‘మాల’ (Mala) రెండో పాటతో మేకర్స్ ప్రమోషన్స్‌ను పీక్స్‌కి తీసుకెళ్లగా, ఇప్పుడు సినిమాపై అంచనాలను అంబరాన్ని తాకించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.
మల్లారెడ్డి యూనివర్సిటీలో బిగ్ ఈవెంట్:
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు (అక్టోబర్ 23) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక బహిరంగ వేడుకలో అత్యంత వైభవంగా విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది! పలుసార్లు విడుదల తేదీ మారినప్పటికీ, తాజా అప్డేట్తో మేకర్స్ ప్రమోషన్స్ దూకుడు పెంచారు. కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహకులు ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన గ్లామరస్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయికగా నటిస్తున్నారు. అలాగే నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు కమెడియన్ సత్య వంటి ప్రముఖ తారాగణం ఇతర కీలక పాత్రల్లో అలరించనున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ (S.S. Thaman) సంగీతం అందిస్తున్నారు.
అక్టోబర్ 30న థియేటర్లలో పండగ వాతావరణం!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్, విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ బాండింగ్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేపు రాబోయే థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయం. అక్టోబర్ 30న థియేటర్లలోకి రానున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు!