టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత (Samantha). తాజాగా ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌తో ఉన్న అనుబంధం గురించి, ఆయన సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న సమంత, విజయ్‌ను తన ‘లక్కీ ఛార్మ్’ (Lucky Charm) అని అభివర్ణించడంతో పాటు ఆయనతో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు.
విజయ్ లక్కీ ఛార్మ్”: సమంత
విజయ్‌తో తాను కలిసి నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయని సమంత చెప్పారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. విజయ్‌తో తాను ‘కత్తి’, ‘పోలీసోడు’, ‘అదిరింది’ వంటి మూడు చిత్రాల్లో జంటగా నటించానని, ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయని గుర్తుచేసుకున్నారు. అందుకే ఆయన తనకెప్పుడూ లక్కీ ఛార్మ్ అని తెలిపారు.
సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలో, కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు అన్నింటినీ వదిలి రాజకీయాల్లోకి వెళ్లడం ఎవరికైనా కష్టమైన నిర్ణయమని, కానీ విజయ్ ఆ సాహసం చేసి చూపించారని ప్రశంసించారు. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి తన కఠిన శ్రమ, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్న విజయ్.. ఎంతోమందికి నిజమైన స్ఫూర్తి అని సమంత అభిప్రాయపడ్డారు.
వైరల్ అవుతున్న విజయ్ – సమంత కాంబో!
తమిళనాడు రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న విజయ్ గురించి స్టార్ హీరోయిన్ సమంత ఈ స్థాయిలో ప్రశంసించడం ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అగ్ర నటుల కాంబో సెంటిమెంట్ మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది.
“My Fav Actor is Vijay sir and he is my lucky charm ♥️” — Samantha
Julie Reaction 😭😂
https://t.co/mM5svXXpXB
— Ayyappan (@Ayyappan_1504) October 22, 2026