ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఇది అసలైన పూనకాలు తెప్పించే వార్త. ‘పుష్ప’ సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో చేయబోయే భారీ బడ్జెట్ చిత్రం #AA23 గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో బన్నీ సరసన ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అల్లు అర్జున్, పూజా హెగ్డేలది టాలీవుడ్లో ఒక సక్సెస్ ఫుల్ జోడీ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దువ్వాడ జగన్నాథమ్, ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ క్రేజీ పేర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనే టాక్ ఉంది. కానీ, అల్లు అర్జున్ సినిమా అంటే కచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాల్సిందే. అందుకే ఈ పాన్ ఇండియా అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్లో పూజా హెగ్డే గ్లామర్ మరియు పర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఒక పక్క లోకేష్ సినిమాల్లో ఉండే ‘డార్క్ థీమ్’ యాక్షన్, మరోవైపు బన్నీ-పూజాల మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్.. వెరసి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ప్రస్తుతం ఈ కాంబినేషన్ కు సంబంధించిన వార్త వైరల్ అవ్వడంతో X లో ‘Iconic Pair Returning’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతుండటం విశేషం. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ కాంబో గనుక సెట్ అయితే, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి!