నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా మారిన ఈ చిత్రం తాజాగా నేడు అమరావతి వేదికగా ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా లాంచ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు.

రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో!
ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను పంచుకున్నారు. బాలయ్య-కొరటాల కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కథ డిమాండ్ మేరకు సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత స్పష్టం చేశారు. బాలయ్య కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
షూటింగ్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?
సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను కూడా మేకర్స్ ఇక్కడే అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను నిరంతరాయంగా జరపడానికి ప్లాన్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలనే గట్టి ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చారు. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ విత్ మాస్ ఎలిమెంట్స్‌కు బాలయ్య నటన తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.