గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా, మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ హీరోయిన్ సమంత ప్రెగ్నెన్సీ వార్తలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తన గర్భధారణపై వస్తున్న రూమర్స్ అన్నింటికీ సమంత స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయడంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్ర ఘన విజయంపై సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. “ఎవరికైనా ఇంతటి భారీ సక్సెస్ వచ్చాక అస్సలు గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయాలనుకుంటారు, మరి మీ ప్లాన్ ఏంటి?” అని ప్రశ్నించారు. దీనికి సమంత నవ్వుతూ సమాధానమిస్తూ.. “సారీ అండి, నేను మరోసారి సినిమాలకు గ్యాప్ తీసుకోక తప్పడం లేదు. ఎందుకంటే నేను త్వరలోనే మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నాను” అని అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు వందకు వంద శాతం నిజమని తేలిపోయింది.
ఇటీవల జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా వేడుకల్లో సమంత టీ షర్ట్, జీన్స్ ధరించి సందడి చేశారు. ఆ సమయంలో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించడంతో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత సమంత దంపతులు మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న సమంత దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మెగాస్టార్ ఇచ్చిన ఆ హింట్‌తోనే అప్పట్లో సగం క్లారిటీ రాగా.. ఇప్పుడు సమంత స్వయంగా నోరు విప్పి ఈ మధురమైన వార్తను పంచుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.