యావత్ దేశం ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించింది. ఎందుకంటే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన నటుడు విజయ్ టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో విజయాలు అందుకున్న దళపతి విజయ్.. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటుతున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేశాడు. విజయ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయే భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు. అయితే చట్టసభ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు చోట్లా గెలిస్తే…మరల ఒక స్థానానికి రాజీనామా చేయాలి.. ఇప్పుడు ఆ ఖాళీ అయ్యే స్థానం నుంచి ఎవరూ పోటీ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.
అయితే గత కొన్ని రోజులుగా విజయ్ – త్రిష మధ్య ఏదో ఉందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ రాజీనామా చేయబోయే ఆ నియోజకవర్గం నుంచి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ బరిలోకి దిగబోతున్నారనే వార్త కోలివుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్, త్రిషలది వెండితెరపై ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వీరు కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు అదే క్రేజ్ ను రాజకీయాల్లోనూ ఉపయోగించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. తన సొంత పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ తరపున గ్లామర్ తో పాటు మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిని బరిలోకి దించడం ద్వారా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారట. త్రిషకు ఉన్న ఫాలోయింగ్ యువతలో చాలా ఎక్కువగా ఉండటం పార్టీకి కలిసివచ్చే అంశమని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై మెరిసిన ఈ జోడీ అసెంబ్లీలోనూ సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంలో త్రిష ముఖ్యమంత్రి అవుతాను అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ముఖ్యమంత్రి ఏమో కానీ.. ఎమ్మెల్యే అయ్యే అవకాశముందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.