Find Articles

రోడ్డు ప్రమాదంలో నిర్మాత ఆర్. బి. చౌదరి మృతి.

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, తమిళ్ హీరో జీవా తండ్రి ఆర్. బి. చౌదరి మరణించారు. ఉదయ్ పూర్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. ఆర్. బి. చౌదరి పూర్తిపేరు.. రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు ఉక్కు ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలో పనిచేశారు. 1989లో ఆర్. బి. చౌదరి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మలయాళంలో పలు సినిమాలు చేశాక.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ను స్థాపించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో దాదాపు 99 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 100 వ సినిమాగా మకుటం తెరకెక్కుతోంది. విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం సెట్స్ పై ఉంది.

ఆర్. బి. చౌదరికి నలుగురు కుమారులు. సురేష్, జీవన్, జితన్ రమేష్, జీవా. సురేష్.. తండ్రిలానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. జీవన్ తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నాడు. రమేష్ 2010 లో విద్యార్థి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆశించిన విజయం దక్కక ప్రస్తుతం సోదరుడితో కలిసి బిజినెస్ చేస్తున్నాడు. చివరి కుమారుడు జీవా.. కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతోన్నాడు. ఆర్. బి. చౌదరి మరణించారు అన్న వార్త తెలియడంతో సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు.

Keerthi