Find Articles

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా నేను చేయాల్సింది.. యంగ్ హీరో!

రాజు వెడ్స్ రాంబాయి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజు వెడ్స్ రాంబాయి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా మొదట తన వద్దకే వచ్చిందని…. కానీ కొన్ని కారణాల వల్ల తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. దర్శకుడు సాయిలు ఈ కథను మొదట తనకే వినిపించారట. సుమంత్ ప్రభాస్‌కు కూడా ఈ కథ బాగా నచ్చి.. సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పాడట. అయితే ఈ కథను వద్దు అనుకోవడానికి కారణం.. గతంలో పల్లెటూరి తెలంగాణ కథాంశంతో సినిమా చేసి ఉండటంతో…. మళ్లీ వెంటనే అలాంటి పాత్రనే చేస్తే ఒకే రకమైన ఇమేజ్‌కు పరిమితం అయిపోతాననే భయం సుమంత్ ప్రభాస్‌కు కలిగిందట. అందుకే, ఈ సినిమా తాను చేయడం కంటే వేరొకరు చేయడం బాగుంటుందని భావించి సున్నితంగా తిరస్కరించారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు సాయిలు తనకు కథ చెప్పినప్పుడు ఊహించిన దానికంటే, తెరపై సినిమాను చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారని సుమంత్ ప్రభాస్ తెలిపాడు. ఫస్ట్ హాఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నాడు.

Keerthi