Find Articles

ఎన్టీఆర్-నీల్ మూవీలో మరో డైరెక్టర్?

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర, వార్ 2 సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్ లు.. అభిమానులను మెప్పించాయి. ఇప్పుడు ఎన్టీఆర్… కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. కాగా ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ఎన్టీఆర్ లుక్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమాలో ప్రశాంత్ నీల్‌తో పాటు మరో డైరెక్టర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక మూవీకి మాటలు అందించే బాధ్యతను మరో ప్రముఖ దర్శకుడికి అప్పగించినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో సాధారణంగా ఎలివేషన్లు, విజువల్స్ మీద ఎక్కువగా ఉంటాయి. కానీ ఎన్టీఆర్ వంటి మాస్ హీరో కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లోని ప్రతి ఫ్రేమ్‌ను తనదైన శైలిలో డిజైన్ చేస్తారు. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాల్లో ప్రశాంత్ మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు డైలాగ్స్ కోసం లేదా స్క్రిప్ట్ వర్క్ కోసం మరో డైరెక్టర్‌ను తీసుకోవడం వల్ల నీల్ మార్క్ మేకింగ్ ఏమైనా తగ్గుతుందా? అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు.

Keerthi