Find Articles

నాగవంశీతో చరణ్.. అయ్యే పనేనా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించబడిన పెద్ది షూటింగ్  కంప్లీట్ చేసి తదుపరి సినిమా కోసం చరణ్ సిద్ధమవుతున్నారు. అయితే, అందరి దృష్టి ఇప్పుడు #RC17 పై పడింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతున్నట్లు కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సంగతి ఎలా ఉంచితే సుకుమార్ సినిమా తరువాత చేయబోయే సినిమా గురించి కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్.

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని తెలుస్తోంది. నాగవంశీ ఇప్పటికే చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే సరైన దర్శకుడి కోసం అన్వేషణ సాగుతోందని సమాచారం. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో  ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఈ కాంబినేషన్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ముఖ్యంగా కొంతమంది అభిమానులైతే అసలు ఇది అయ్యే పనేనా అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

Keerthi