Find Articles

మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్ వీళ్ళ కోసమే అనౌన్స్ చేసినట్టున్నాడు..

నేటి టెక్నాలజీ యుగంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అనేది ఒక ట్రెండ్‌గా మారింది. అయితే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి, ఇంటి నుండే వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? అనే విభిన్నమైన పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. త్రిగుణ్ (ఈషా ఫేం), పాయల్ రాధాకృష్ణ (పాపం ప్రతాప్ ఫేం) జంటగా నటించిన ఈ చిత్రం మే 15న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్  ట్రైలర్ లాంచ్ నిర్వహించింది.

సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే లక్షల్లో జీతం, ఏసీ గదుల్లో పని అని అనుకుంటాం. కానీ ఈ చిత్ర హీరో ఐటీ రంగాన్ని వీడి, మట్టి మనుషులతో కలిసి సాగు వైపు అడుగులు వేస్తాడు. ఈ క్రమంలో తన కుటుంబం నుంచి, ప్రేమించిన అమ్మాయి నుంచి ఎదురైన సవాళ్లు ఏమిటి? వాటిని అతను సరదాగా, వినోదాత్మకంగా ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం ప్రధాని మోదీ గారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్‌ను ప్రోత్సహిస్తున్నారు. మా సినిమా కూడా అదే ట్రెండ్‌లో వస్తోంది. కేవలం ఐటీ ఉద్యోగులకే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందించాం. ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి” అని హీరో త్రిగుణ్ కోరారు.

దర్శకుడు మధుదీప్  మాట్లాడుతూ:”ఒక మంచి సినిమాను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశాం. ఓపెన్ మైండ్‌తో చూస్తే అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.” అని పేర్కొన్నారు.

నిర్మాత అరవింద్ మండెం మాట్లాడుతూ… “మేము ఈ చిత్రాన్ని చాలా అడ్వాన్స్‌డ్ ఆలోచనతో తీశాం. ప్రధాని కూడా మెచ్చుకునే స్థాయిలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై వచ్చిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలి.” అని కోరారు.

హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ… “నేను సంతకం చేసిన మొదటి ప్రాజెక్ట్ ఇదే. చాలా ప్యాషన్‌తో పని చేశాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి.” అని చెప్పింది.

మే 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. వ్యవసాయంపై మక్కువ ఉన్న యువతకు, ఐటీ ఉద్యోగులకు కనెక్ట్ అయ్యే అంశాలతో వస్తున్న ఈ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి!

Keerthi