టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ పెద్ది ఇప్పుడు ఫైనల్ కౌంట్‌డౌన్‌లోకి వచ్చేసింది. జాతీయ అవార్డు గ్రహీత, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఫైనల్ ఎడిట్ పూర్తయి, లాక్ చేయబడింది. అంటే, థియేటర్లలో విజువల్ వండర్‌ను ఆవిష్కరించడానికి ‘పెద్ది’ పూర్తిస్థాయిలో ముస్తాబైందన్నమాట!
ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎడిటింగ్ ప్రక్రియ ముగియడంతో, సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. బుచ్చిబాబు విజన్‌కు తగ్గట్టుగా షార్ప్ ఎడిటింగ్, ఎమోషనల్ డెప్త్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ముఖ్యంగా రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యారు. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడంతో, చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ గ్లింప్స్‌లోనే సంచలనం రేపింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ‘పెద్ది’ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక అభిమానుల కోసం జూన్ 3 నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం ఇందులోని అగ్రశ్రేణి టెక్నీషియన్లు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తన స్వరాలతో ఈ సినిమాకు ప్రాణం పోస్తున్నారు. విజువల్స్ పరంగా ఆర్. రత్నవేలు మ్యాజిక్ చేయబోతున్నారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి ఉద్ధండులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారీ యాక్షన్ ఎపిసోడ్స్, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో వస్తున్న ఈ ‘పెద్ది’ వెండితెరపై ఒక హిస్టారిక్ ప్రభంజనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్.. గెట్ రెడీ ఫర్ ది బాక్సాఫీస్ రాంపేజ్!