Find Articles

‘సింగ్ గీతం’ వీడియోలో డార్లింగ్ అల్లరి.. ఐఫోన్ వాల్‌పేపర్ చూశారా?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సరికొత్త అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయనకు సంబంధించిన ‘సింగ్ గీతం’ అనే ప్రత్యేక ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఈ వీడియోలో గ్లోబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ చేసిన సందడే! వైజయంతీ మూవీస్ అధినేత, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ చేసిన హంగామా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఫన్నీ చాట్
ఈ ప్రమోషనల్ వీడియోలో ప్రభాస్ తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ను సరదాగా ఆటపట్టిస్తూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “నాగ్ అశ్విన్‌తోనేనా.. నాతో సినిమా ఎప్పుడు చేస్తారు?” అంటూ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావును ప్రభాస్ సరదాగా నిలదీయడం, ఆయనతో సినిమా చేయడానికి పట్టుబట్టడం అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చింది.

వైరల్ అవుతున్న స్టైలిష్ లుక్.. ‘కర్ణ’ వాల్‌పేపర్!
ఈ వీడియోలో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్యమైన విషయం.. ప్రభాస్ ఐఫోన్ వాల్‌పేపర్. ఆయన తన ఫోన్‌లో ‘కర్ణ’ క్యారెక్టర్ వాల్‌పేపర్‌ను పెట్టుకున్నట్లు ఈ వీడియో ద్వారా బయటకు వచ్చింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
లెజెండరీ మేకర్ సింగీతంపై ప్రభాస్‌కు ఉన్న గౌరవం, నాగ్ అశ్విన్‌తో ఉన్న స్నేహం ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ క్రేజీ వీడియో గురించే ముచ్చటించుకుంటున్నారు.

Keerthi