Find Articles

ధనుష్ – మృణాల్ ఠాకూర్ లవ్‌ స్టోరీకి ఎండ్‌ కార్డ్‌!

గత కొంతకాలంగా సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిన స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ల రిలేషన్‌షిప్ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడొస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ లవ్ బర్డ్స్ తమ బంధానికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది.

వీరిద్దరి ప్రేమాయణం గురించి రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేయగా, ఇప్పుడు ఏకంగా వీరి బ్రేకప్ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ధనుష్, మృణాల్ ఠాకూర్లు ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీరిద్దరికీ అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సమాచారం. అయితే, అంతగా ఇష్టపడిన ఈ జంట హఠాత్తుగా విడిపోవడానికి గల అసలు కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

గతంలో వీరిద్దరూ ఒకరికొకరు ఎంతో సపోర్ట్‌గా ఉండేవారు. ఒకరి సినిమా ప్రమోషన్స్, స్పెషల్ ఈవెంట్లలో మరొకరు ప్రత్యేకంగా హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఒకరిపై ఒకరు చూపించుకునే లవ్ అండ్ కేర్ చూసి, వీరు త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని అందరూ భావించారు. కానీ, అంతలోనే ఈ క్రేజీ కపుల్ విడిపోయారనే వార్త వినాల్సి రావడంతో ఇరు హీరో హీరోయిన్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ విషయంపై ధనుష్ లేదా మృణాల్ అధికారికంగా స్పందిస్తారేమో చూడాలి.

Keerthi