Find Articles

త్రిష సైలెంట్.. విజయ్ బర్త్‌డే రోజున షాకింగ్ ట్విస్ట్

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ జూన్ 22న తన 52వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన సీఎం అయ్యాక వచ్చిన మొదటి బర్త్‌డే కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్క పేరు.. స్టార్ హీరోయిన్ త్రిష. గత కొన్నేళ్లుగా విజయ్ పుట్టినరోజున ప్రత్యేకంగా విషెస్ చెప్పే త్రిష, ఈసారి మాత్రం కంప్లీట్ సైలెంట్‌గా ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆమె మౌనం వెనుక అసలు కథేంటి?

గత కొన్నాళ్లుగా విజయ్, త్రిషల మధ్య రిలేషన్‌షిప్ ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా విజయ్ పుట్టినరోజు వచ్చిందంటే చాలు.. త్రిష ఆయనతో కలిసి దిగిన రేర్ అండ్ స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెప్పేది. ‘లియో’ షూటింగ్ సమయం నాటి పిక్స్‌తో మొదలుపెట్టి, గతేడాది తన పెంపుడు కుక్కతో విజయ్ ఆడుకుంటున్న క్యూట్ ఫోటో వరకు ప్రతిసారీ క్రేజీ పోస్ట్‌లు పెట్టేది. కానీ, ఈ ఏడాది ఆమె ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంతో వీరిద్దరూ విడిపోయారనే ప్రచారానికి బలం చేకూరినట్లయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారా?

త్రిష విషెస్ చెప్పకపోవడంతో పాటు, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేసిందంటూ నెట్టింట ఒక కొత్త చర్చ ఊపందుకుంది. ఈ క్రేజీ కపుల్ మధ్య విభేదాలు రావడంతోనే త్రిష ఈ నిర్ణయం తీసుకుందని కొందరు నెటిజన్లు స్క్రీన్ షాట్స్‌తో సహా ప్రచారం మొదలుపెట్టారు.

అయితే ఈ ‘అన్‌ఫాలో’ వ్యవహారంపై ఇండస్ట్రీ వర్గాల నుండి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అసలు మొదటి నుంచి త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను ఫాలో కాలేదని, ఆమె కేవలం గతంలో ఆయనను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు మాత్రమే పెట్టిందని కొందరు అభిమానులు గుర్తు చేస్తున్నారు. కేవలం బర్త్‌డే పోస్ట్ పెట్టనంత మాత్రాన ఇద్దరూ విడిపోయినట్లు కాదంటూ మరికొందరు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

టాక్ ఆఫ్ ది టౌన్ ఇటీవల జరిగిన విజయ్ సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా త్రిష తన తల్లితో కలిసి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా విజయ్ బర్త్‌డే రోజున ఆమె సైలెంట్‌గా ఉండటం, బ్రేకప్ రూమర్స్ వైరల్ అవ్వడం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది. ఈ క్రేజీ అప్‌డేట్‌పై త్రిష స్వయంగా క్లారిటీ ఇస్తేనే కానీ ఈ సస్పెన్స్‌కు తెరపడేలా లేదు.

Keerthi