Find Articles

విజయ్ సినిమాతో క్లాష్.. కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, టాలెంటెడ్ బ్యూటీ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ ప్యూర్ రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్‌స్టోరీ’ (Chennai Love Story). కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘బేబి’ ఫేమ్ సాయి రాజేశ్‌ నిర్మాణంలో, రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీ ప్రియ సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

దళపతి విజయ్ సినిమాతో పోటీ.. డేట్ మారితే బాగుండేది!

ఈ ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ రిలీజ్ డేట్ క్లాష్‌పై చాలా ఓపెన్‌గా స్పందించారు. “మా సినిమా విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందే (జులై 23న) తమిళనాడు సీఎం, దళపతి విజయ్ గారి ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ రిలీజ్ అవుతోంది. విజయ్ గారికి నా తరఫున ఆల్ ది బెస్ట్. అది ఆయన కెరీర్‌లోనే లాస్ట్ సినిమా కాబట్టి సహజంగానే ఆడియన్స్, థియేటర్ల ఫోకస్ అంతా అటే ఉంటుంది. నిజం చెప్పాలంటే మా సినిమాకు వేరే డేట్ దొరికి ఉంటే చాలా బాగుండేదనిపించింది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేము. అయితే కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమానైనా కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది” అని కిరణ్ చెప్పుకొచ్చారు.

పెళ్లైన ప్రతి ఒక్కరూ రిలేట్ అవుతారు.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్!

ఈ కథపై తనకు ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. “నేను వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పటికీ, నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ ‘చైన్నై లవ్ స్టోరీ’కే ఇచ్చాను. ఇందులో హీరో పాత్ర అమ్మాయిని ఎంతో గౌరవిస్తూ ‘మీరు, అండీ’ అని పిలుస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు కూడా పొరపాటున కూడా ‘నువ్వు’ అనే పదాన్ని వాడడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే సీన్స్ చూసి పెళ్లైన ప్రతి జంట ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మాస్ సినిమాలు చేసిన నాకు ఈ క్లాస్ లవ్ స్టోరీ ఒక పెద్ద ఛాలెంజ్. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కనీసం ఐదు సీన్లు మిమ్మల్ని వెంటాడుతాయి. పదేళ్ల తర్వాత నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకున్నా, నా బెస్ట్ సినిమాల్లో ఇది టాప్‌లో ఉంటుంది” అని ఎమోషనల్ అయ్యారు.

అసలైన ప్రేమను గుర్తుచేసే కథ!

హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. “ఒక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే కేవలం హీరో చుట్టూనే తిరగకూడదు. ఇందులో అబ్బాయితో పాటు అమ్మాయి పాత్రకు అంతే సమాన ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజుల్లో అసలైన ప్రేమ అంటే ఏంటి? ఎంత స్వచ్ఛంగా ప్రేమించవచ్చు? అనే విషయాలను చాలామంది మర్చిపోతున్నారు. నా క్యారెక్టర్ వాటన్నింటినీ ఆడియన్స్‌కు మళ్లీ గుర్తుచేస్తుంది” అని నమ్మకంగా వెల్లడించారు. సరికొత్త డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్‌తో రాబోతున్న ఈ స్వచ్ఛమైన ప్రేమకథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Keerthi