టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో నిత్యం తమ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన స్వీట్ అండ్ ఫన్నీ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా చైతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది.

తన కోసం భార్య శోభిత స్వయంగా వంట చేసిన పిక్‌ను ఇన్స్టాలో షేర్ చేసిన నాగచైతన్య.. “పెళ్లయిన దాదాపు రెండేళ్లకు నా భార్య నా కోసం ప్రత్యేకంగా వంట చేసింది. బహుశా ఈరోజు నేను ఏదో మంచి పనే చేసి ఉంటాను” అంటూ సరదాగా క్యాప్షన్ జత చేశారు. దీనికి శోభిత కూడా తక్కువేమీ తినకుండా స్పందిస్తూ.. “నన్ను పొగుడుతున్నావా.. లేక ట్రోల్ చేస్తున్నావా?” అని ఫన్నీ ఎమోజీతో ఇచ్చిన రిప్లై నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ దంపతుల సరదా కామెంట్స్ చూసి ఫ్యాన్స్ క్యూట్ కపుల్ అంటూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. ‘తండేల్’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న నాగచైతన్య, ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే హై-బడ్జెట్ మైథలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. మరోవైపు శోభిత రీసెంట్‌గా క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’తో మెప్పించగా, పా.రంజిత్ కాంబినేషన్‌లో వస్తున్న తమిళ చిత్రం ‘వెట్టువం’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.