Find Articles

సినిమా అంటే డబ్బు కాదు.. జీవితాలు!: ‘మిస్సింగ్ మేఘన’ ఈవెంట్‌లో దామోదర్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

యంగ్ అండ్ టాలెంటెడ్ రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’ (Missing Meghana). పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ అండ్ కేడి & కో బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న దాదాపు 150కి పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది.

“చిన్న సినిమాలను చంపకండి.. నిలబడి పోరాడాలి!”: దామోదర్ ప్రసాద్ బాంబ్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “సినిమా అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు.. కొందరి జీవితాలు! చిన్న సినిమాలకు ఎన్నో అడ్డంకులు వస్తాయి, కానీ ప్రొడ్యూసర్ రిలీజ్ తేదీ వరకు కాన్ఫిడెన్స్‌తో గట్టిగా నిలబడాలి. హీరో రామ్ కార్తీక్ పాషన్ చూసి, ఈ టీమ్‌లోని యంగ్ టాలెంట్‌ను సపోర్ట్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. సెప్టెంబర్ 18న వస్తున్న ఈ కంటెంట్ ఉన్న సినిమాను మీడియా, ఆడియన్స్ సపోర్ట్ చేయాలి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నమ్మకంతోనే రంగంలోకి దిగాం: బెక్కం వేణుగోపాల్!

ప్రముఖ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, “నరేష్ ఈ సినిమా నిర్మించిన తర్వాత నేను ప్రత్యేకంగా చూశాను. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి, నా వంతు సపోర్ట్ అందించడానికి ముందుకొచ్చాను. వాచస్పతి టేకింగ్, ఆర్.ఆర్. ధృవన్ మ్యూజిక్, రామ్ కార్తీక్, అంకిత్ నటన సినిమాకు ప్రాణం పోశాయి” అని తెలిపారు.

దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత పర్ఫెక్ట్‌గా రావడం వెనుక బలమైన కథే కారణమని, తమ ప్రయాణంలో తోడుగా ఉన్న టెక్నికల్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. హీరో రామ్ కార్తీక్ మరియు అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. సెప్టెంబర్ 18న రాబోతున్న ఈ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూసి ఆశీర్వదించాలని కోరారు.

తారాగణం & టెక్నికల్ టీమ్:

గోపరాజు రమణ, కౌశిక్, మహిపాల్, నళిని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా, వనరాజ్ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న సూపర్ రెస్పాన్స్‌తో సెప్టెంబర్ 18న బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తామని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.

Keerthi