Find Articles

రామ్ చరణ్ సెంటిమెంట్ లాకెట్ కొట్టేసిన శ్రీకాంత్ ఓదెల!

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ అండ్ రా మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో ఉన్న బాండింగ్ గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

చరణ్‌ను నిద్రలేపి మరీ ఇబ్బంది పెట్టా.. కానీ!

తన కెరీర్ ప్రారంభంలో ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోజులను శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. “రంగస్థలం షూటింగ్ సమయంలో కాస్ట్యూమ్స్, కాల్ షీట్స్ విషయంలో రామ్ చరణ్ సార్‌ను నేను బాగా ఇబ్బంది పెట్టాను. కొన్నిసార్లు తెల్లవారుజామున 3.30 గంటలకే నిద్రలేపేవాడిని. అయినా ఆయన నాపై ఒక్కసారి కూడా కోప్పడలేదు, ఏమీ అనలేదు” అని శ్రీకాంత్ తెలిపారు.

షూటింగ్ పూర్తయ్యాక చరణ్ చేసిన పనికి శ్రీకాంత్ షాక్ అయ్యారట. “రంగస్థలం సినిమా మొత్తం చరణ్ సార్ మెడలో హనుమంతుడి లాకెట్ ఉంటుంది. నిజానికి అది మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించిన సెంటిమెంట్ లాకెట్. షూటింగ్ ముగిశాక చరణ్ సార్ ఆ లాకెట్‌ను తీసి నాకు గిఫ్ట్‌గా ఇచ్చి.. ‘ఇకపై దీన్ని నువ్వే వేసుకో’ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఆ లాకెట్‌ను నేను మెడలో నుంచి తీయలేదు” అని ఎమోషనల్ అయ్యారు.

నాని కెరీర్‌లోనే మైండ్ బ్లాకింగ్ ఎమోషన్స్!

ఇక తన కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ గురించి శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. నాని కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి వినూత్నమైన, నెక్స్ట్ లెవెల్ భావోద్వేగాలు ఉన్న సినిమా రాలేదని ధీమా వ్యక్తం చేశారు. ఏ భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా సినిమాలో రాబోయే నాని ఇంట్రడక్షన్ సీన్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుందని స్పష్టం చేశారు.

Keerthi