Find Articles

నా ప్రతీ విజయానికి ఆమే కారణం… గౌరీ ప్రియ

ఇటీవల విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ గౌరీ ప్రియ (Gouri Priya) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన ‘సక్సెస్ మీట్’ లో మాట్లాడిన ఆమె, తన జీవితంలో సాధించిన ఈ విజయాన్ని చూసేందుకు తన తల్లి లేకపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు.

“నా ప్రతీ విజయానికి ఆమే కారణం!”

వేదికపై గౌరీ ప్రియ మాట్లాడుతూ.. “నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విజయాన్ని చూసి ఆనందించడానికి ఈ రోజు నా పక్కన మా అమ్మ ఉండి ఉంటే ఎంత బాగుండేదో! ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ద్వారా ఈ రోజు నాకు వస్తున్న మంచి పేరు, గుర్తింపు అంతటికీ మా అమ్మే ప్రధాన కారణం. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మద్దతు లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునేదాన్ని కానే కాదు” అని ఎమోషనల్ అయ్యారు.

మోగుతున్న ఫోన్లు.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు!

సినిమా విడుదలైనప్పటి నుంచి తనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల గౌరీ హర్షం వ్యక్తం చేశారు. “నిన్నటి నుంచి నా ఫోన్ నిరంతరం మోగుతూనే ఉంది. నా నటనకు, పాత్రకు ప్రేక్షకులు అలానే పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మెచ్చుకోళ్లు వస్తున్నాయి. ఈ సక్సెస్ నాకు ఎంతో ప్రత్యేకమైనది” అని వెల్లడించారు.

ఈ చిత్రంలో గౌరీ ప్రియ కనబరిచిన సహజసిద్ధమైన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండగా, ఆమె మాట్లాడిన భావోద్వేగ మాటలు ఇప్పుడు నెట్టింట అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Keerthi