Find Articles

ప్రేమలో ఉన్నప్పుడు సూర్య అలా.. ఇప్పుడు సీన్ రివర్స్!: జ్యోతిక

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్లీ అండ్ సక్సెస్‌ఫుల్ కపుల్స్‌లో సూర్య (Suriya), జ్యోతిక (Jyotika) జంట ఒకటి. వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టి విజయవంతంగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ వైవాహిక జీవితం, ప్రేమ రోజులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“అప్పుడు నా సంపాదన 3 రెట్లు ఎక్కువ.. ఇప్పుడు 30 రెట్లు తక్కువ!”

తమ ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక సమతుల్యత కెరీర్ గ్రాఫ్ గురించి జ్యోతిక సరదాగా స్పందించారు. “మేము ప్రేమించుకుంటున్న సమయంలో (2006లో) సూర్య కంటే నా రెమ్యునరేషన్, సంపాదన 3 రెట్లు ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం సూర్య సంపాదనతో పోలిస్తే నా రెమ్యునరేషన్ 30 రెట్లు తక్కువైంది” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

పరస్పర గౌరవమే మా బంధానికి మూలం!

జ్యోతిక మాట్లాడుతూ తమ సంబంధం కేవలం ప్రేమపైనే కాకుండా పరస్పర గౌరవం (Mutual Respect) మీద నడుస్తుందని తెలిపారు. “వ్యక్తిగా, భర్తగా, నటుడిగా సూర్య చాలా గొప్ప వ్యక్తి. సమాజంలో లేదా ఇంట్లో భార్యాభర్తలిద్దరూ సమానమే అనే భావన ఆయనలో ఎప్పుడూ ఉంటుంది. అదే మా బంధాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఇంత బలంగా నిలిపింది” అని సూర్యపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు.

Keerthi