ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎక్సైటింగ్ మూవీ ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ కల్ట్ ప్రొడ్యూసర్ SKN లాంచ్ చేశారు.
ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేయగా, ఫస్ట్ సింగిల్ ‘పిల్లా పిల్లా’ను లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచేసింది.
కథాంశం చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది: ప్రొడ్యూసర్ SKN
టీజర్ లాంచ్ అనంతరం ప్రొడ్యూసర్ SKN మాట్లాడుతూ.. “మిస్సింగ్ మేఘన టీజర్ చూశాను, కాన్సెప్ట్ అండ్ లైన్ చాలా కొత్తగా, ఇన్నోవేటివ్‌గా అనిపించాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో కొత్త కంటెంట్‌తో వచ్చే చిత్రాలనే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడం అభినందనీయం!
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ అడగ్గానే ముందుకొచ్చి తమ టీజర్ లాంచ్ చేసిన SKNకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా మారిన SKN హ్యాండ్ చాలా లక్కీ అని, ఆయన చేతుల మీదుగా టీజర్ రావడం తమకు పెద్ద ప్లస్ అని హీరో రామ్ కార్తీక్, ప్రొడ్యూసర్ నరేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
నటీనటులు & సాంకేతిక వర్గం
ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శామ్. కే. నాయుడు ఛాయాగ్రహణం అందించగా, ఆర్.ఆర్. ధృవన్ సంగీతం సమకూర్చారు. వనరాజ్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, వెంకట్ బద్దిగం మాటలు రాశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.