కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, కేజీఎఫ్ గ్రాండ్ సక్సెస్ తర్వాత వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి క్రేజీ స్టార్ కాస్టింగ్ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి యష్ ‘మాన్స్టర్ మానియా’ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ సమీక్షలో చూద్దాం.
టాక్సిక్ కథేంటంటే?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా గోవా ప్రాంతం పోర్చుగీస్ పాలనలో ఉన్న రోజుల నాటి కథ ఇది. తన సోదరి గంగ (నయనతార) అండతో రాయ (యష్) గోవాపై ఆధిపత్యం సాధించేందుకు స్కెచ్ వేస్తాడు. ఈ క్రమంలో గోవాని ఏలుతున్న సాల్వడార్ కుమార్తె రెబెకాతో పెళ్లికి సిద్ధమవుతాడు. అయితే మరోపక్క సర్కస్ కంపెనీ నడిపే నదియా (కియారా అద్వానీ)తో రాయ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ, సామ్రాజ్యాధిపత్యం కోసం ప్రేమించిన నదియాను పక్కన పెట్టాలని గంగ సూచించడంతో దానికి కూడా రాయ ఒప్పుకుంటాడు. మరి ప్రియురాలిని కాదని రాయ గోవాని ఎలా సొంతం చేసుకున్నాడు? అసలు రాయ, గంగల వెనుక ఉన్న అసలు కథేంటి? మకావు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనేది వెండితెరపై చూడాల్సిందే.
మూవీ ఎలా ఉందంటే?
సినిమా ప్రారంభం నుంచే కియారా అద్వానీ పాత్రతో ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లోకి కథను తీసుకెళ్లారు. యష్‌ను ఒక పవర్ఫుల్ మాన్స్టర్గా ఎలివేట్ చేసే సన్నివేశాలు, ఆయన మాస్ యాక్షన్ అండ్ స్టైలిష్ అవతార్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఫైట్ సీక్వెన్సెస్ చాలా రిచ్‌గా కంపోజ్ చేశారు.
అయితే కేజీఎఫ్ స్థాయి ‘హై మూమెంట్స్’ మాత్రం ఇందులో కాస్త లోపించాయనే చెప్పాలి. మొదటి భాగంలో ఉన్న ఫ్లో, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కాస్త మందగిస్తుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం సినిమాకి పెద్ద మైనస్. క్లైమాక్స్ ముందుకు వచ్చే సైకలాజికల్ ట్విస్ట్ సీన్లు అంతగా వర్కవుట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ నిడివి కాస్త ఎక్కువగా అనిపించడం ప్రేక్షకులను కాస్త అసహనానికి గురిచేస్తుంది.
ఎవరెలా చేశారంటే?
యష్ తనదైన స్వాగ్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘రాయ’, ‘టికెట్’ అనే రెండు విభిన్న పాత్రల్లో అదరగొట్టాడు. నయనతార పాత్ర పరిమితమైనప్పటికీ ఉన్నంతలో యాక్షన్ సీన్లలో మెరిసింది. కియారా అద్వానీ తన గ్లామర్‌తో పాటు అభినయంతోనూ ఆకట్టుకోగా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్ఎక్స్ (VFX) మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. భారీ సెట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. నేపథ్య సంగీతం ఓకే అనిపించినా, ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.
చివరిగా..
ఓవరాల్‌గా ‘టాక్సిక్’ చిత్రం కేజీఎఫ్ లాంటి కంప్లీట్ కిక్ ఇవ్వకపోయినా.. యష్ స్టైలిష్ యాక్షన్, మితిమీరిన వయోలెన్స్ సినిమాలను ఇష్టపడే యాక్షన్ లవర్స్‌కు మంచి ఛాయిస్!
రేటింగ్ 3/5