అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో సుమంత్ ప్రధాన పాత్రలో, ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటించగా.. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సిద్ధు జొన్నలగడ్డ, రాజీవ్ కనకాల, మంజు భార్గవి కీలక పాత్రల్లో కనిపించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో మైండ్ బ్లోయింగ్ బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మిస్టికల్ డ్రామా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో రివ్యూలో చూద్దాం!