Find Articles

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లో పవర్‌ఫుల్ విలన్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఇంటెన్స్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం రామ్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా డే అండ్ నైట్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కాగా, ఈ చిత్రంలో రామ్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌కు సంబంధించిన సంచలన వార్త ఒకటి ఇప్పుడు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో తీవ్రంగా చక్కర్లు కొడుతోంది.

ఎస్.జె. సూర్య కాదు.. బాలీవుడ్ స్టార్ ఫైనల్!

ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ రోల్ కోసం మేకర్స్ మొదట తమిళ వర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్యను సంప్రదించినట్లు సమాచారం. అయితే పారితోషికం విషయంలో బేరసారాలు తెగకపోవడంతో ఆ అవకాశం మరో సంచలన నటుడికి దక్కింది. ప్రముఖ నటి, రామ్ సరసన నటించిన జెనీలియా భర్త, బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో రామ్, జెనీలియా జోడీగా నటించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె భర్తే రామ్‌కు విలన్‌గా మారి ముఖాముఖి తలపడనుండటం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

డిసెంబర్ బరిలో దిగుతున్న ఎనర్జిటిక్ స్టార్!

ఈ సంచలన విలన్ కాస్టింగ్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, అన్ని పనులను పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ రేసులో సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Keerthi