Find Articles

ది ప్యారడైజ్’ సెన్సార్ పూర్తి.. నిడివి, టికెట్ రేట్లు ఎంతో తెలుసా!

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యి, రిలీజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.

నాని కెరీర్లోనే ఫస్ట్ టైమ్.. ‘ఏ’ సర్టిఫికెట్ షాక్!

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు (CBFC) సెన్సార్ సర్టిఫికేషన్‌ను పూర్తి చేసి ‘A’ (Adults Only) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సెన్సార్ బోర్డు మొత్తం 21 మార్పులు చేర్పులను సూచించగా, అందులో ఎక్కువ భాగం వైలెన్స్‌కు సంబంధించిన సన్నివేశాలే కావడం గమనార్హం. సినిమా నిడివి 2 గంటల 54 నిమిషాల 04 సెకన్లుగా (174 నిమిషాలు) లాక్ అయ్యింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. “ఈ కథకు ఉన్న తీవ్రత (Intensity) దృష్ట్యా ఖచ్చితంగా ‘ఏ’ సర్టిఫికెట్ వస్తుందని ముందే ఊహించాం. దీనివల్ల పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం కొంత కష్టమే అయినప్పటికీ, ఒక నటుడిగా అన్ని రకాల జానర్లను ప్రయత్నించాలనే ఈ సినిమా చేశా. త్వరలోనే నా నుంచి మళ్ళీ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు వస్తాయి” అని స్పష్టం చేశారు.

తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్!

రిలీజ్ సందడి మొదలవ్వడంతో తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి శిఖాగోయల్ జీవో జారీ చేస్తూ సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతించారు.

  • స్పెషల్ ప్రీమియర్ (సెప్టెంబర్ 23): రూ. 500 (జిఎస్టీతో కలిపి).

  • మొదటి విడత (సెప్టెంబర్ 24 – 27): సింగిల్ స్క్రీన్స్ అదనంగా రూ. 48, మల్టీప్లెక్స్‌లు అదనంగా రూ. 94 (జిఎస్టీతో కలిపి).

  • రెండో విడత (సెప్టెంబర్ 28 – అక్టోబర్ 03): సింగిల్ స్క్రీన్స్ అదనంగా రూ. 23, మల్టీప్లెక్స్‌లు అదనంగా రూ. 45 (జిఎస్టీతో కలిపి) పెంచుకోవడానికి అనుమతినిచ్చారు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి!

Keerthi