Find Articles

హే పోండి.. నా ఇంటిమేట్ సీన్స్ సినిమాలో వద్దు!

కియారా అద్వానీ… ఈ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో ప్రేక్షకులకు వసుమతిగా పరిచయం అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ వినయ విదేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయినా.. అమ్మడికి మాత్రం తెలుగులో క్రేజ్ అయితే ఏర్పడింది. అయితే తెలుగు సినిమాలు వదిలేసి.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న చిత్రం టాక్సిక్. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా… గీతూమోహన్ దాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్.. అందరినీ ఆకట్టుకుంది. యష్.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో కియారా అద్వానీ ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. టాక్సిక్ సినిమాలో యష్, కియారా అద్వానీ మధ్య కొన్ని బోల్డ్, ఇంటిమెట్ సీన్స్ ఉన్నాయట. షూటింగ్ సమయంలో కియారా నో చెప్పకుండా చేసినప్పటికీ… ఎడిటింగ్ పూర్తయ్యాక ఫైనల్ కట్ చూసి ఆలోచనలో పడిందని టాక్ వినిపిస్తోంది. అంటే.. ఈ సినిమాలు కథా పరంగా అవసరమే అయినప్పటికీ.. తెరపై చూసినప్పుడు తనకు అతిగా కనిపిస్తున్నాయని భావిస్తోందని సమాచారం. దీంతో ఆ సీన్లను తొలగించాలని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ను కోరినట్లు బాలీవుడ్ న్యూస్ చక్కర్లు కోడుతోంది. తన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని కియారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మాత్రం ఈ సీన్లను తొలగించలేమని చెప్పారట. అయితే ఈ విషయంలో యష్, గీతూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రం జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా… గ్రాఫీక్స్ తదితర కారణాల కారణంగా వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ టాక్సిక్ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Keerthi