అఖండ, వీర సింహరెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్.. మొన్నటి అఖండ తాండవం… ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ లతో నందమూరి నటసింహ బాలయ్య మంచి జోష్ మీద ఉన్నాడు. బాలయ్య సినిమా అంటేనే అభిమానులకు పండుగ. అలాంటిది బాలయ్య నెక్ట్స్ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. తనకు సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో కలిసి బాలయ్య మరోసారి #NBK111 మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను అనుకున్నారు. ఇప్పటికే బాలయ్యతో నయన్.. సింహ, శ్రీరామరాజ్యం, జైసింహ చిత్రాలు చేసి.. సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. వీరి కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్స్ కూడా మరో హిట్ ఖాయం అనుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయన్ ఈ సినిమా తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. నయనతార హిందీలో సల్మాన్ ఖాన్ తో ఓ మూవీ చేస్తుండటంతో కాల్షీట్లు దొరక్కపోవడం కారణంగా తెలుస్తోంది. ఇదే కాకుండా నయన్.. బాలయ్య సినిమాకు 10కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తోంది. దీంతో మేకర్స్.. చందమామ బ్యూటీ కాజల్ ఆగర్వాలన్ ను సంప్రదించారట. కాజల్ కూడా బాలయ్యతో నటించేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. గతంలో బాలయ్యతో కాజల్ ఆగర్వాల్ భగవంత్ కేసరిలో నటించింది. ఇక ఈ సినిమాతో మరోసారి హిట్ కొడుతుందో లేదో చూడాలి.