ప్రస్తుత కాలంలో భారీ యాక్షన్ సినిమాలు, కమర్షియల్ హంగామాలు ఎన్ని వస్తున్నా, ప్రేక్షకులకు మాత్రం మనసుకి హత్తుకునే, కుటుంబంతో కలిసి చూసే ‘క్లీన్ ఎమోషనల్’ కథలే ఇప్పుడు మ్యాజిక్ చేస్తున్నాయి. ఆ కోవలోనే రాబోతున్న సరికొత్త ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ‘రమణి కళ్యాణం’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
“కోల్పోయిన ప్రతి మనిషి వెనుక ఒక కథ ఉంటుంది” అనే లోతైన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్, ఆద్యంతం ప్రేక్షకులను కథలో లీనం చేసేలా ఉంది. చూపు లేని యువతి (సంజన RJ), నడవలేని స్థితిలో ఉన్న యువకుడు (రాజ్) – వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ, వారు ఎదుర్కొన్న సవాళ్లను డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి చాలా సహజంగా తెరకెక్కించారు. ఎక్కడా కృత్రిమత్వం లేకుండా, ప్రతి సన్నివేశాన్ని మనసుకు దగ్గరగా చూపించడం ఈ సినిమాకు ప్రధాన బలం.
ఈ చిత్రంలో సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ల కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. వారిద్దరి మధ్య నడిచే సంభాషణలు చాలా ఫ్రెష్‌గా, సహజంగా ఉన్నాయి. ఇక, ‘కోర్ట్’ ఫేం రామ్ జగదీష్ కలం నుంచి వచ్చిన మాటలు ట్రైలర్‌కు ప్రాణం పోశాయి. ప్రతి డైలాగ్ లోనూ ఒక అర్థం, ఎమోషన్ కనిపిస్తోంది.
సాంకేతికపరంగా చూస్తే, ఈ సినిమాకు విజువల్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద ప్లస్ పాయింట్. ఎమోషనల్ సీన్స్‌ని మరింత ఎలివేట్ చేసేలా సాగిన మ్యూజిక్, ప్రేక్షకులను కథలో మరో స్థాయికి తీసుకెళ్తుంది.
కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా, కేవలం ప్రేమకథ మాత్రమే కాదు, జీవితంలో ఆశను చిగురింపజేసే ఒక అందమైన ప్రయాణం. హడావుడి లేని, హృదయానికి హాయినిచ్చే సినిమాను కోరుకునే వారికి ‘రమణి కళ్యాణం’ ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ట్రైలర్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. మరి ఈ రమణి కళ్యాణం వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలంటే.. మే 22 వరకు వేచి చూడాల్సిందే!