చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న సరికొత్త యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “రిస్క్”. జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో, యువ నటుడు సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. కాగా, ఈ చిత్రాన్ని జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
తాజాగా ఈ సినిమాలోని ప్రమోషన్స్‌లో భాగంగా “దేవుడు వరమందిస్తే” అనే మెలోడీయస్ సాంగ్‌ను బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన లాంచ్ చేశారు. అద్భుతమైన బాణీలతో సాగే ఈ పాట సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్లో దర్శకుడు ఘంటాడి కృష్ణ, హీరో సందీప్ అశ్వ, నిర్మాతలు రావి సురేష్ రెడ్డి, గుర్రం నర్సిములు, సహ నిర్మాత గడ్డం రవి కుమార్, కో-డైరెక్టర్ బన్సీ కోయల్ కార్ తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌ను మరింత వినూత్నంగా ముందుకు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ఒక క్రేజీ కాంటెస్ట్‌ను అనౌన్స్ చేసింది. “దేవుడు వరమందిస్తే” పాటలోని హుక్ స్టెప్‌కు డాన్స్ చేస్తూ లేదా రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో #DevuduVaramandisthe, #RISKMovie, #SandeepAshwa హాష్‌ట్యాగ్‌లతో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వీడియోలను ఎంపిక చేసి, వారికి చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు.
ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్‌తో పాటు ఉత్కంఠ రేకెత్తించే సస్పెన్స్ అంశాల కలయికతో ఈ సినిమాను రూపొందించారు. ఖచ్చితంగా ఈ చిత్రం థియేటర్లకు వచ్చే ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుందని చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.