Find Articles

పవన్ కల్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ.. అసలు కారణం ఏంటంటే?

తెలుగు రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామం చర్చనీయాంశంగా మారింది.  ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ సైనస్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఇటీవల ఒక చిన్నపాటి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నేరుగా పవన్ ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు.

శస్త్రచికిత్స తర్వాత పవన్ కోలుకుంటున్న తీరును, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దాదాపు కొద్దిసేపు సాగిన ఈ భేటీలో పవన్‌కు ప్రధాని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని పూర్తిస్థాయిలో ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్ కుటుంబ సభ్యులతో కూడా మోదీ మాట్లాడినట్లు సమాచారం.

సాధారణంగా ప్రధాని స్థాయి వ్యక్తి ఒక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నివాసానికి స్వయంగా వెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కేవలం ఇది ఆరోగ్య పరామర్శే అయినప్పటికీ, పవన్ కల్యాణ్ పట్ల ప్రధానికి ఉన్న ప్రత్యేక గౌరవం, వీరిద్దరి మధ్య ఉన్న పొలిటికల్ బాండింగ్ ఈ పర్యటన ద్వారా మరోసారి స్పష్టమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Keerthi