Find Articles

టాలీవుడ్ చరిత్రలో నెవర్ బిఫోర్.. రాజమౌళికే సాధ్యంకాని ‘ఐమాక్స్ 8K’ టెక్నాలజీతో రాబోతున్న విజువల్ వండర్ ‘ది మానిటి.ఇన్’!

తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కాదు, ఏకంగా వేల కోట్ల వసూళ్లే టార్గెట్‌గా ఓ భారీ విజువల్ వండర్ తెరకెక్కేందుకు ముస్తాబవుతోంది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌కు ఏమాత్రం తీసిపోని అత్యున్నత సాంకేతిక విలువలతో, టాలీవుడ్ రూపురేఖలను మార్చేసేందుకు దర్శకుడు బీఎస్ రావు సిద్ధమయ్యారు. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆ గ్లోబల్ ప్రాజెక్ట్ పేరే ‘ది మానిటి.ఇన్’ (The Manity.in). ఇండియన్ సినిమాలో తొలిసారిగా ‘IMAX 8K’ మ్యాజిక్
దర్శకధీరుడు రాజమౌళి సైతం ఐమాక్స్ టెక్నాలజీతో సినిమా చేయడానికి చాలా ఏళ్లు సమయం తీసుకున్నారు. కానీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విభాగంలో తనకున్న అపారమైన అనుభవంతో డైరెక్టర్ బీఎస్ రావు తన తొలి సినిమాకే ఏకంగా ‘IMAX 8K’ ఫార్మాట్‌ను ఎంచుకుని ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తున్నారు. “IMAX 8k never before” అనే కాన్సెప్ట్‌తో ప్రతి ఫ్రేమ్‌ను ఒక విజువల్ పోయెట్రీలా మలచాలన్నది ఆయన తపన. ఈ అత్యాధునిక టెక్నాలజీతో ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతున్నారు.

స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఎవరైనా ఈజీగా ఇమిడిపోయేలా కథను రాసుకున్న దర్శకుడు.. ఇప్పటికే ఈ పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌ను ఇద్దరు స్టార్ హీరోలకు వినిపించారు. ఏ స్టార్ హీరో ముందుకు వచ్చినా, వెంటనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ చేస్తారో, వారి కెరీర్‌కు ఇదొక మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని దర్శకుడు బల్లగుద్ది చెబుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసి గ్లోబల్ మార్కెట్‌లో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విజువల్స్, క్యారెక్టరైజేషన్స్‌కి పిల్లలు, యూత్ ఫిదా అవ్వడం ఖాయమని మేకర్స్ నమ్ముతున్నారు.

Keerthi