తెలుగు చిత్రసీమలో ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ, ఒక సినిమా కోసం ఏకంగా ఒక కుటుంబం మొత్తం కదలిరావడం, అది కూడా ఎంతో ప్యాషన్‌తో సినిమాను నిర్మించడం చాలా అరుదుగా చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి క్రేజీ మరియు ఎమోషనల్ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పక్కా యాక్షన్ అండ్ విలేజ్ డ్రామా “రాయవలస”. యంగ్ టాలెంట్ కార్తీక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ, ఆయన తల్లి రాధిక జయంతి దర్శకత్వంలో, తండ్రి గోపీకృష్ణ జె నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రేసన్ (RaysuN) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై “Love Tied by Fate” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు యంగ్ హీరో ఆకాశ్ జగన్నాథ్, ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
టీజర్ చూసిన అనంతరం హీరో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “టీజర్ చాలా కనెక్టింగ్ గా, అద్భుతంగా ఉంది. ఒక తల్లి డైరెక్టర్‌గా మారి తన కొడుకుని హీరోగా లాంచ్ చేయడం, దానికి తండ్రి ప్రొడ్యూసర్‌గా అండగా నిలవడం చాలా క్రేజీగా అనిపిస్తోంది. ఈ బాధ్యత తీసుకున్న దర్శకురాలు రాధిక గారికి హ్యాట్సాఫ్. కార్తీక్ చాలా మల్టీ టాలెంటెడ్. యాక్టింగ్, సింగింగ్ మాత్రమే కాదు ప్రొడక్షన్ పనుల్లోనూ తను పడ్డ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తోంది. హీరోయిన్ శ్రీష చాలా అందంగా ఉంది. సినిమా కంటెంట్ బాగుంటే మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ భుజాన వేసుకుని మోస్తారు, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి” అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం ఒకే కల కోసం ఏకమై చేసిన ఈ “రాయవలస” చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయాలని ఆశిద్దాం!