సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ సంచలనం జరిగినా, అక్కడ వేణుస్వామి పేరు వినిపించాల్సిందే. సెలబ్రిటీల జాతకాలు చెప్పడం, అవి వైరల్ అవ్వడం, ఆ తర్వాత నెటిజన్ల ట్రోల్స్‌కు గురికావడం ఆయనకు కొత్తేమీ కాదు. తాజాగా ఈయన గురి తమిళ దళపతి విజయ్ రాజకీయ భవిష్యత్తుపై పడింది. అయితే ఈసారి వేణుస్వామి చెప్పిన జోస్యాలు వింటుంటే.. ఇది జ్యోతిష్యమా లేక కేవలం అటెన్షన్ కోసమా అనిపిస్తోంది.
వేణుస్వామి తాజా జోస్యం ప్రకారం.. విజయ్ రాజకీయ జీవితంలో త్రిష అనే పేరు ఒక పెద్ద అడ్డంకిలా ఉందట. ఒకవేళ త్రిష లేకపోయి ఉంటే విజయ్ జాతకం మరోలా ఉండేదని ఆయన సెలవిచ్చారు. అంతేకాదు, విజయ్ ఒకవేళ సీఎం అయినా సరే, ఆరు నెలలు లేదా ఏడాది లోపే తమిళనాడులో మళ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. విజయ్ సన్నిహితులు, ఆయన ఎదుగుదలను చూసిన వారు మాత్రం.. త్రిష వల్లే విజయ్ ఈ స్థాయికి చేరుకున్నారని, వారిద్దరి కాంబినేషన్ ఒక సక్సెస్ ఫుల్ కెమిస్ట్రీ అని చెబుతుంటారు. మరి జాతకాన్ని నమ్మాలా? లేక కళ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను నమ్మాలా? అయితే వేణుస్వామి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన చెప్పిన చాలా జోస్యాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని గంటాపథంగా చెప్పారు. ఫలితాలు ఎలా వచ్చాయో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ఆరోగ్యం, పెళ్లి విషయంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం నిజం కాలేదు. అయితే ఇవన్నీ చూస్తుంటే ఒక పాటర్న్ కనిపిస్తోంది. ఎవరైతే ట్రెండింగ్‌లో ఉంటారో, వారి పేరు మీద ఒక వివాదాస్పద స్టేట్మెంట్ ఇవ్వడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూసుకోవడం. తద్వారా తన బ్రాండ్ వాల్యూని పెంచుకుని, దాన్ని బిజినెస్‌గా మార్చుకోవాలనే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది