Find Articles

గోదారి గట్టుపైన బానే రాబట్టిందే!

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంటున్న తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’ . కూలెస్ట్ సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్‌కు సంబంధించిన ఓ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 3.06 కోట్ల రూపాయలకు పైగా (3.06 Cr+ Gross) వసూళ్లను సాధించి సత్తా చాటింది. కంటెంట్ బలంగా ఉండి, సహజమైన వినోదాన్ని పంచుతుంటే ఆడియన్స్ కచ్చితంగా బ్రహ్మరథం పడతారని ఈ సినిమా రిజల్ట్ మరోసారి నిరూపించింది.

గ్రామీణ వాతావరణంలో, అందరికీ కనెక్ట్ అయ్యే సహజమైన పాత్రలతో దర్శకుడు సుభాష్ చంద్ర ఈ చిత్రాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మలిచారు. ఆద్యంతం నవ్విస్తూనే, ఓ మంచి ఫీల్‌ను అందించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. వేసవి సెలవుల్లో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు ఇదొక పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారింది. ఈ ఫీల్ గుడ్ మూవీని అభినవ్ రావు ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు. ఏషియన్ సినిమాస్, రెడ్ పప్పెట్ బ్యానర్ల సమర్పణలో వచ్చిన ఈ చిత్రానికి సరిగమ మ్యూజిక్ అందించగా ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. “ఇంకా సినిమా చూడని వారు వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి” అంటూ మేకర్స్ ఉత్సాహంగా పిలుపునిస్తున్నారు.

Keerthi