కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలను సైతం తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. ఇదే నమ్మకంతో తెరకెక్కిన బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘రమణి కళ్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ పతాకంపై విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య వశిష్ట, దీప్షిక జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ సీనియర్ నటి జయసుధ అట్టహాసంగా విడుదల చేశారు.
కమర్షియల్ సినిమాల్లోని రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఇందులో లీడ్ పెయిర్ క్యారెక్టర్స్ చాలా ఛాలెంజింగ్‌గా ఉండటం విశేషం. హీరో సూర్య వశిష్ట వీల్ చైర్‌కే పరిమితమైన యువకుడి పాత్రలో, దీప్షిక కంటిచూపు లేని (అంధురాలి) అమ్మాయిగా నటిస్తున్నారు.
హీరో సూర్య వశిష్ట ఏమన్నారంటే.. “రమణి కళ్యాణం అనే టైటిల్లోనే ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంది. వీల్‌చైర్‌లో కదలకుండా కూర్చుని నటించడం నాకు ఒక సవాల్‌గా అనిపించింది. కుటుంబమంతా కలిసి చూసే క్లీన్ ఫ్యామిలీ మూవీ ఇది.”
హీరోయిన్ దీప్షిక మాట్లాడుతూ.. అంధురాలి పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని, ఈ చిత్రం ప్రతి ఒక్కరిలో ఓ ‘హోప్’ (ఆశ)ను నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. “ఈ సినిమాకు రామ్ జగదీశ్ అందించిన డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎంతో ప్యాషన్‌తో, మంచి టీమ్ సపోర్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. థియేటర్లలో చూస్తేనే ప్రేక్షకులకు అసలైన అనుభూతి కలుగుతుంది” అని చెప్పారు. ఈ వేడుకకు విచ్చేసిన జయసుధ గారి ప్రశంసలు తమ టీమ్‌కి ఎంతో ఎనర్జీని ఇచ్చాయని చిత్ర నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి సంతోషం వ్యక్తం చేశారు.