Find Articles

ధురంధర్ రికార్డులు బద్ధలు కొట్టిన రామ్ చరణ్ పెద్ది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ హద్దులు దాటి బాలీవుడ్ అంచనాలను మించిపోతోంది. గ్లోబల్ స్టార్‌గా వెలుగుతున్న చరణ్, తన తదుపరి చిత్రం పెద్దితో ఉత్తరాది మార్కెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడయ్యాయని, ఇది ఇటీవల భారీ విజయం సాధించిన ధురంధర్ సినిమా రికార్డులను కూడా అధిగమించిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘RRR’ తర్వాత రామ్ చరణ్ కి హిందీ బెల్ట్‌లో ఏర్పడిన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ సినిమా కోసం పోటీ పడుతున్నాయి. ‘ధురంధర్’ సినిమా హిందీ శాటిలైట్ మరియు డిజిటల్ బిజినెస్ పరంగా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ‘పెద్ది’ ఆ మార్కును చాలా సునాయాసంగా దాటేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ప్రముఖ సంస్థ జియో స్టూడియోస్  ‘పెద్ది’ హిందీ వెర్షన్ హక్కులను దక్కించుకుంది. ఈ డీల్ వాల్యూ ఎంత అన్నది అధికారికంగా ప్రకటించకపోయినా, ఇప్పటివరకు ఒక సౌత్ ఇండియన్ సినిమా హిందీ శాటిలైట్ హక్కుల పరంగా చూస్తే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్ అని తెలుస్తోంది. కేవలం శాటిలైట్ మాత్రమే కాకుండా, నాన్-థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ చరణ్ సినిమా సంచలనం సృష్టిస్తోంది.

రామ్ చరణ్ ఈ సినిమాలో పూర్తిస్థాయి రస్టిక్ లుక్‌లో, ఒక మట్టి మనిషిగా  కనిపించబోతున్నారు. 1980ల నాటి నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా, కేవలం కథా బలంతోనే కాకుండా చరణ్ పర్ఫార్మెన్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ‘పెద్ది’ సృష్టించిన ఈ శాటిలైట్ సునామీ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద కూడా మరిన్ని కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమనిపిస్తోంది.

Keerthi