Find Articles

మెగా ప్రిన్సెస్ ‘క్లీంకార’ అఫీషియల్ లుక్ వచ్చేసింది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల ముద్దుల కుమార్తె, మెగా ప్రిన్సెస్ క్లీంకార కొణిదెల ముఖాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఎంతో కాలంగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది. క్లీంకార పుట్టినరోజును పురస్కరించుకుని ఉపాసన సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు.నేడు క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా ఉపాసన కొణిదెల తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక అద్భుతమైన ఫ్యామిలీ పిక్‌ను పంచుకున్నారు. ఈ ఫోటోలో రామ్ చరణ్, ఉపాసన తమ ముద్దుల కుమార్తె క్లీంకారతో కలిసి ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు క్లీంకార ఫోటోలను కేవలం వెనుక నుంచి లేదా ముఖం కనిపించకుండా మాత్రమే షేర్ చేస్తూ వచ్చిన ఈ జంట, మొదటిసారిగా క్లీంకార పూర్తి రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

> “మా గుండె చప్పుడు, మా ప్రపంచం క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ ఉపాసన ఈ ఫోటోను షేర్ చేశారు.
>
ఈ ఫోటోలో క్లీంకార క్యూట్ లుక్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చూస్తుండగానే క్లీంకారకు మూడేళ్లు నిండాయా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి రామ్ చరణ్ పోలికలతో, అమాయకత్వంతో నిండిన క్లీంకార కళ్లల్లో మెగా లైనప్ స్పష్టంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Keerthi