Find Articles

బీచ్ వెకేషన్‌లో కరీనా కపూర్ రచ్చ.. ‘హాట్ హస్బెండ్’ అంటూ పోస్ట్

బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్ (Kareena Kapoor), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ప్రస్తుతం ఈ లవ్లీ కపుల్ తమ ఫ్యామిలీతో కలిసి ఒక అందమైన లొకేషన్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే బీచ్‌లో దిగిన ఒక హాట్ బికినీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేసిన కరీనా.. తాజాగా తన భర్త సైఫ్ అలీఖాన్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పిక్‌ను అభిమానులతో పంచుకున్నారు.

తన భర్త స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన కరీనా.. దానికి ‘సమ్మర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం’ అంటూనే, ‘హాట్ హస్బెండ్’ (#HotHusband) అనే క్రేజీ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. భర్తపై ఉన్న ప్రేమను ఈ రేంజ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయడంతో ఈ ఫొటో కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు, బాలీవుడ్ లవర్స్.. “బి-టౌన్‌లో మీరిద్దరే బెస్ట్ అండ్ హాటెస్ట్ కపుల్” అంటూ క్రేజీ కామెంట్స్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఈ జంట మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.

Keerthi