Find Articles

షాకింగ్: సైలెంటుగా రెండో పెళ్లి పీటలెక్కిన హీరోయిన్

బుల్లితెరపై ‘కలర్స్’ కార్యక్రమంతో యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వెండితెరపై హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాతి రెడ్డి (Swathi Reddy) గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన ఈ హోమ్లీ బ్యూటీ.. తాజాగా ఒక సంచలన ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన సినిమాను తెరకెక్కించిన దర్శకుడినే ఆమె సైలెంటుగా రెండో వివాహం చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

విడాకుల రూమర్స్ నిజమేనంటూ.. డైరెక్టర్‌తో ఏడడుగులు!

గతంలో (2018లో) స్వాతి.. కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె, ఇటీవల ‘మంత్ ఆఫ్ మధు’ (Month of Madhu) అనే చిత్రంతో వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ఆమె తన భర్తతో విడిపోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ విడాకుల వార్తలపై స్పందించడానికి స్వాతి పూర్తిగా నిరాకరించింది.

అయితే, వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ స్వాతి ఇప్పుడు నేరుగా తన రెండో పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ‘మంత్ ఆఫ్ మధు’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని (శివాజీ నాగోతిని) ఆమె రెండో వివాహం చేసుకుంది.

సోషల్ మీడియా వేదికగా క్లారిటీ..

“మేము పెళ్లి చేసుకున్నాం” అంటూ దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ట్యాగ్ చేస్తూ తన పెళ్లి ఫొటోలను స్వాతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్‌తో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురైనప్పటికీ, కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇండస్ట్రీలో తమను డైరెక్ట్ చేసిన దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్టులో ఇప్పుడు ‘కలర్స్’ స్వాతి కూడా చేరిపోయింది. గతంలోనూ పలువురు స్టార్ హీరోయిన్లు తమ దర్శకులను వివాహం చేసుకోగా, ఇప్పుడు స్వాతి కూడా అదే బాటలో పయనిస్తూ సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది.

Keerthi