టాలీవుడ్‌లో సరికొత్త క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ పడింది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), విలక్షణ నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu) కలిసి ఒకే స్క్రీన్‌పై రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌కు ముందే టైటిల్ లీక్..
ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి ‘వీరాధి వీరులంట’ అనే ఒక వైవిధ్యమైన, పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే చిత్ర బృందం టైటిల్‌తో కూడిన అధికారిక ప్రకటనను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఆగస్టులోనే షూటింగ్.. సంక్రాంతి రేసులో మాస్ రాజా!
ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను రాబోయే ఆగస్టు నెల నుంచే పట్టాలెక్కించేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. అంతేకాదు, ఎలాంటి ఆలస్యం లేకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలపాలని నిర్మాత గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ యాక్షన్ డ్రామా వచ్చే నెలలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘ఇరుముడి’ థియేటర్లలో సందడి చేసిన వెంటనే రవితేజ, శ్రీవిష్ణుతో కలిసి ‘వీరాధి వీరులంట’ షూట్‌లో జాయిన్ కాబోతున్నారు. ఈ ఇద్దరు హీరోల టైమింగ్‌కు హసిత్ గోలి మార్క్ తోడైతే బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతరతో పాటు యాక్షన్ బ్లాస్టింగ్ ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.