అక్కినేని యంగ్ హీరో అఖిల్, లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా ప్రతిభావంతుడైన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంత ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చినప్పటికీ, మేకర్స్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.
నార్త్ అమెరికాలో ‘లెనిన్’ కలెక్షన్ల సునామీ!
టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ల పరంగా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్ గా నిలబడటం విశేషం. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ అయిన నార్త్ అమెరికా (యూఎస్)లో ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కాయి. అక్కడ ప్రీమియర్స్‌తో కలుపుకుని ఇప్పటికే 2 లక్షల 50 వేల డాలర్ల మార్క్‌ను ఈజీగా దాటేసిన లెనిన్.. ఇప్పుడు చాలా వేగంగా 3 లక్షల డాలర్ల మార్క్ దిశగా దూసుకుపోతున్నాడు.
ఫస్ట్ వీకెండ్లోనే హాఫ్ మిలియన్ క్లబ్?
ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ చూస్తుంటే, ఈ ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి ‘లెనిన్’ చాలా సులువుగా హాఫ్ మిలియన్ (500k) మార్క్‌ను దాటేసి, వన్ మిలియన్ డాలర్ల క్లబ్ వైపు అడుగులు వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చినప్పటికీ, అఖిల్ అక్కినేని తన కెరియర్లో ఒక సాలిడ్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకున్నాడని చెప్పొచ్చు.
స్టార్ కంపోజర్ ఎస్.ఎస్. థమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. మాస్ ఎలిమెంట్స్, ఎంగేజింగ్ ట్విస్టులు తోడవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగించేలా కనిపిస్తోంది.