Find Articles

‘హృదయం మురళి’లో మాళవిక సర్ప్రైజ్.. ఫోటోలు వైరల్!

యంగ్ హీరో అథర్వ మురళి, వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్స్‌లో వచ్చిన లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇదయం మురళి’. తెలుగులో ‘హృదయం మురళీ’ పేరుతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమా చూసిన ఆడియన్స్‌కు థియేటర్లలో ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎదురైంది. స్టార్ బ్యూటీ మాళవిక మోహనన్ ఈ సినిమాలో ఒక అదిరిపోయే క్యూట్ క్యామియో రోల్‌లో మెరిసి ప్రేక్షకులను ఫిదా చేసింది. తాజాగా ఆమె ఈ చిత్ర షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

https://x.com/MalavikaM_/status/2077279178031063528?s=20

ఫహద్ నా ఓల్డ్ ఫ్రెండ్.. ఆ ముచ్చట ఇప్పటికి తీరింది!

ఈ సినిమాలో మాళవిక మోహనన్ పక్కా సాంప్రదాయ తమిళ వధువు (పెళ్లికూతురు) గెటప్‌లో కనిపించి వెండితెరపై మెరిసిపోయింది. దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమా తర్వాత డిజైనర్ పల్లవి సింగ్ తనను మళ్లీ ఇంత అందమైన సాంప్రదాయ లుక్‌లో రెడీ చేశారంటూ మాళవిక తన పోస్ట్‌లో సంతోషం వ్యక్తం చేసింది.

ఇక ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో కలిసి తను చేసిన హిలేరియస్ ఫన్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది. దీనిపై మాళవిక స్పందిస్తూ.. “ఫహద్ నాకు ఎప్పటి నుంచో చాలా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఒక ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం. కానీ కుదరడం లేదు. ప్రస్తుతానికి ఈ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా అయినా ఫహద్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే నా ముచ్చట తీరింది” అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.

షూటింగ్ స్పాట్‌లో కాలేజ్ డేస్ గుర్చొచ్చాయి!

‘హృదయం మురళి’ చిత్ర బృందం గురించి చెప్తూ.. సెట్స్‌లో ఉన్నవాళ్లంతా ఎంతో యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నారని, వారితో వర్క్ చేస్తుంటే తనకు మళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్లినట్లు అనిపించిందని మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చింది.

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలలో పెళ్లికూతురు గెటప్‌లో మాళవిక చాలా సీరియస్‌గా ఉండగా, ఆమె పక్కనే నిలబడి ఫహద్ ఫాజిల్ ఏదో సీరియస్‌గా డిస్కస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. థియేటర్లలో సైతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సీన్లకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

Keerthi