Find Articles

దళపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సెన్సార్ కట్స్ లేకుండా థియేటర్లలో!

తమిళనాడు ముఖ్యమంత్రి, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ‘దళపతి’గా నిలిచిన విజయ్ (Vijay) ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు ఒక సాలిడ్ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) థియేట్రికల్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రాన్ని జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ అధికారికంగా ప్రకటించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానుల హంగామా, సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

సెన్సార్ అడ్డంకులు దాటుకుని.. ‘A’ సర్టిఫికెట్‌తో రన్ టైమ్ ఫిక్స్!
నిజానికి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగానే బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సింది. కానీ తీవ్రమైన సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులు, సుదీర్ఘ విచారణల కారణంగా ఈ సినిమా విడుదల నిరంతరం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పునః పరిశీలన తర్వాత అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది.

సినిమాలోని పవర్‌ఫుల్ కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఏ’ (A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఏకంగా 183 నిమిషాల (3 గంటల 3 నిమిషాలు) భారీ రన్ టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ కెరీర్ లోనే ఇదొక సుదీర్ఘమైన హై-వోల్టేజ్ నిడివి గల సినిమా కావడం విశేషం.

హెచ్. వినోద్ మార్క్ యాక్షన్ ధమాకా!
యాక్షన్ సినిమాలను డీల్ చేయడంలో పర్ఫెక్ట్ అనిపించుకున్న హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో ముస్తాబైంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో విజయ్ సరసన స్టార్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించగా, క్రేజీ బ్యూటీ మమితా బైజు ఒక కీలకమైన పాత్రలో మెరిసింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వస్తున్న చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Keerthi