Find Articles

మహేశ్ బాబు ఆ సినిమాతోనే కృష్ణ మనవడి ఎంట్రీ

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో క్రేజీ వారసుడు వెండితెరపై రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. సూపర్‌స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఆయన మనవడు జయకృష్ణ (Jayakrishna) హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో జయకృష్ణ టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. జులై 30న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన ప్రమోషన్స్ ఈవెంట్‌లో హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా థడానీ పాల్గొని సందడి చేశారు.

మూడేళ్ల వయసులోనే బాబాయ్ సినిమాలో యాక్టింగ్!

వైజాగ్‌ ప్రెస్‌మీట్‌లో జయకృష్ణ తన సినీ ప్రయాణం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. “నేను హీరోగా రావడం ఇప్పుడే కావచ్చు, కానీ నేను కేవలం మూడేళ్ల వయసు ఉన్నప్పుడే మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను. మా మహేశ్ బాబు బాబాయ్ హీరోగా నటించిన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ ‘నిజం’లో ఒక చిన్న పాత్రలో కనిపించాను. ఆ తర్వాత నాకు 17 ఏళ్లు వచ్చాక సినిమాలే నా ప్రపంచం అని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ నేర్చుకుంటూ ప్రొఫెషనల్‌గా నన్ను నేను మల్చుకున్నాను. ఇక ‘శ్రీనివాస మంగాపురం’లో నా క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా, ఒక అల్లరి కుర్రాడిలా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.

బాక్సాఫీస్ వద్ద అజయ్ భూపతి మార్క్ విజువల్స్!

రొటీన్ సినిమాలకు భిన్నంగా రా అండ్ రస్టిక్ ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన అజయ్ భూపతి, ఈ చిత్రాన్ని కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జయకృష్ణ సరసన రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం జులై 30న బాక్సాఫీస్ వద్ద ఘట్టమనేని వారసుడికి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

Keerthi