Find Articles

పెళ్లి దెబ్బకు విజయ్-రష్మిక ‘రణబాలి’ పోస్ట్‌పోన్?

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ విడుదలపై ఊహించని ప్రచారం మొదలైంది. సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం కష్టమేనని, సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

పెళ్లి బ్రేక్.. ఆలస్యమైన షూటింగ్!

వాస్తవానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు మొదట్లోనే అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల ఈ లవ్లీ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో, కొన్ని రోజుల పాటు ‘రణబాలి’ షూటింగ్‌కు తాత్కాలిక విరామం లభించింది. ఈ వెడ్డింగ్ బ్రేక్ వల్ల ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ అన్నీ కాస్త వెనక్కి వెళ్లాయి.

త్వరలోనే కొత్త రిలీజ్ డేట్?

ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణ వేగాన్ని బట్టి చూస్తే, ముందుగా అనుకున్న సెప్టెంబర్ 11 నాటికి పోస్ట్ ప్రొడక్షన్, ప్యాచ్ వర్క్ పనులు పూర్తికావడం కష్టమేనని మేకర్స్ భావిస్తున్నారట. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో విడుదల తేదీని ము ముందుకు జరపాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ విషయమై స్పష్టతనిస్తూ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Keerthi