Find Articles

అల్లు అర్జున్, లోకేష్ మూవీలోకి పూజా హెగ్డే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,  తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ #AA23 పై టాలీవుడ్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌కి సంబంధించిన ప్రతీ చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరోసారి అలరించనున్న హిట్ జోడీ!

ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేయబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, ఇండస్ట్రీ హిట్ కొట్టిన ‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ – పూజా హెగ్డే కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడం ఖాయం. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి తిరుగులేదని ఇప్పటికే నిరూపితమవ్వడంతో ఈ వార్త విన్న అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

లోకేష్‌తో వర్క్ చేసిన అనుభవం!

దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి కూడా పూజా హెగ్డేతో మంచి అనుబంధం ఉంది. ఇటీవల రజినీకాంత్ హీరోగా లోకేష్ తెరకెక్కించిన ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ‘AA23’ లో ఆమెను ఏకంగా ఫుల్-లెంగ్త్ హీరోయిన్ పాత్రకే పరిగణనలోకి తీసుకుంటున్నారని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Keerthi